
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు గత వారం పదిశాతం పైగా నమోదైందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేరళలో ఆరు జిల్లాలు ఆరు, ఈశాన్య రాష్ట్రాల్లో 29 జిల్లాలు, రాజస్ధాన్‌లో రెండు జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక జిల్లా ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 40 కోట్ల మందికి పైగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు, మరో 11 కోట్ల మందికి సెకండ్ డోసు పూర్తయిందన్నారు. వ్యాక్సినేషన్ రేటు క్రమంగా పెరుగుతోందని లవ్ అగర్వాల్ తెలిపారు.
Agarwal:Vaccinationsteadily
0 Comments